ఇండియాను 2జీ టెక్నాల‌జీ లేని దేశంగా మార్చాలి

ఇండియాను 2జీ టెక్నాల‌జీ లేని దేశంగా మార్చాలి

2జీ ఇక వద్దే వ‌ద్దు ..ఈ పాత టెక్నాల‌జీని వదిలించుకోవాలి

న్యూఢిల్లీ: ఇండియాను 2జీ టెక్నాల‌జీ లేని దేశంగా మార్చాల‌ని రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ మరోసారి స్ప‌ష్టం చేశారు. ఈ పాత టెక్నాల‌జీకి ముగింపు పలకడానికి ప్ర‌భుత్వం అర్జెంటుగా చర్య‌లు తీసుకోవాలని సూచించారు. ‘‘మనదేశంలో 30 కోట్ల మంది ఫీచర్ ఫోన్లు వాడుతున్నారు. వీటిలో బేసిక్ ఇంటర్నెట్ ఫీచర్లు కూడా ఉండటం లేదు. ఇండియాతో పాటు చాలా దేశాలు 5జీ టెక్నాల‌జీ ముంగిట ని
లుచుకున్న‌ సమయంలో 2జీ మనకు అవసరం లేదు. జనానికి లేటెస్ట్ టెక్నాల‌జీని అందించడానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలి”అని అంబానీ స్ప‌ష్టం చేశారు. ఇండియాలో మొబైల్ సేవలు మొదలై 25 ఏళ్లు ముగిసిన సందర్భంగా ఢిలీల్లో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఈ మాట‌లు అన్నారు.

తక్కువ‌ ధరకే 4జీ లేదా 5జీ ఫోన్ తయారు చేయడానికి జియో ఇటీవలే గూగుల్ తో చేతులు కలిపింది. వీటి ద్వారా ఇండియాను ‘2జీ ముక్త్ భారత్’గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించింది. 5జీ సొల్యూషన్స్ ను కూడా తయారు చేశామని ఇటీవల ఏజీఎంలో అంబానీ వెల్ల‌డించారు. అయితే రిలయన్స్ జియో గతంలో లైఫ్ పేరుతో విడుదల చేసిన 4జీ స్మార్ట్ ఫోన్స్ సకెస్స్ కాలేదు. డిజిటల్ టెక్నాల‌జీని పూర్తి స్థాయిలో భారతీయులకు అందించడంలో జియో ముందంజలో నిలిచిందని రిలయన్స్ చీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..