రిలయన్స్ కు ‘ఫ్యూచర్’

రిలయన్స్ కు ‘ఫ్యూచర్’

రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ సెగ్మెంట్ల కొనుగోలు
డీల్ విలువ రూ.24,713 కోట్లు

ముంబై: బిగ్‌‌‌‌‌‌‌‌బజార్ వంటి హైపర్‌ మార్కెట్లు నిర్వహించే కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూపులో పలు సెగ్మెంట్లను రిలయన్స్ సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌కు చెందిన రిటైల్, హోల్‌‌‌‌సేల్‌, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ బిజినెస్ సెగ్మెంట్ల కొనుగోలు కోసం రూ.24,713 కోట్లు ఖర్చు చేసింది. రిలయన్స్‌కు వాటాల అమ్మకానికి శనివారం జరిగిన ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(ఎఫ్ఈఎల్) బోర్డుమీటింగ్ గ్రీన్‌‌‌‌సిగ్నల్ ఇచ్చింది. డీల్ పూర్తిగా నగదు చెల్లింపు పద్ధతిలో జరుగుతుంది. ఎఫ్ఈఎల్‌లో వాటాల కొనుగోలుకు రిలయన్స్ చర్చలు జరుపుతోందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డీల్ ఫైనల్‌ కాదని, మార్పులు ఉంటాయని రిలయన్స్ పేర్కొంది. డీల్‌ ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ కొన్ని కంపెనీల బిజినెస్‌‌‌‌లను ఎఫ్ఈఎల్‌లో కలుపుతుంది. ఈ యూనిట్‌ను రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌‌‌‌స్టైల్‌ లిమిటెడ్ (ఆర్ఆర్ఎఫ్ఎల్ఎల్)కు బదిలీ చేస్తారు. లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ కంపెనీలను మాత్రం నేరుగా ఆర్ఆర్వీఎల్‌లో కలుపుతారు. ‘‘కరోనా, ఎకానమీ క్రైసిస్ వల్ల మా కంపెనీ ఎదుర్కొంటున్నసమస్యలు ఈ డీల్ వల్ల పరిష్కారం అవుతాయి. వాటాదారులు, లెండర్లు, సప్లయర్లు, ఉద్యోగుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం”అని ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీ చెప్పారు. విలీనంపూర్తయిన కూడా 6.09 శాతం ఈక్విటీ హోల్డింగ్‌‌‌‌ ను దక్కించుకోవడానికి ఆర్ఆర్ఎఫ్ఎల్ఎల్ ఎఫ్ఈఎల్లో రూ.1,200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనాలని కూడా రిలయన్స్ ప్రపోజల్ తెచ్చింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఈక్విటీ వారంట్ల ద్వారా మరికొంత వాటా కొంటుంది. దీనివల్ల ఎఫ్ఈఎల్‌లో ఆర్ఆర్ఎఫ్ఎల్ఎల్ వాటా 75 శాతానికి చేరుతుంది. ఎఫ్ఈఎల్ వాటాలను కొన్నప్పటికీ ఫ్యూచర్ బిజినెస్ మోడల్స్‌నే కొనసాగిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించారు. ఫ్యూచర్ గ్రూపు అప్పుల బాధ్యత కూడా తమదేనని వెల్లడించారు. ఈ డీల్ పూర్తయ్యాక ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌కు కిరాణా వస్తువులు, దుస్తుల మానుఫ్యాక్చరింగ్, ఇన్సూరెన్స్, ఎన్టీసీ మిల్స్ బిజినెస్‌‌‌‌లు మాత్రమే మిగులుతాయి. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ గ్రూపునకు రూ.12,778 కోట్లఅప్పులు ఉన్నాయి. ఈ మార్చికల్లా కొన్నిలోన్లను కట్టాల్సి ఉంది. అయితే ఆర్‌బీఐ మారటోరియం కొంత ఊపిరినిచ్చింది. రేపటి నుంచి మారటోరియం అయిపోతుండటంతో బియానీ తన వ్యాపారాలను అమ్మకతప్పలేదు. ఇది వరకే ఆయన పాంటలూన్‌ రిటైల్‌ను, ఫ్యూచర్‌ క్యాపిటల్స్‌ను అమ్మేసి అప్పులు కట్టారు.

బ్రూక్‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతికి జియో టవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?
టవర్లను నిర్వహించే రిలయన్స్‌ జియో ఇన్‌ఫ్రాటెల్‌ను కొనుగోలు చేసేందుకు కెనడా కంపెనీ బ్రూక్‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వంనుంచి అనుమతులు లభించాయి. టవర్‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను రూ.25,200 కోట్లకు కొనుగోలు చేసేందుకు బ్రూక్‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గతేడాది ప్రభుత్వానికి ప్రపోజల్‌ పంపింది. టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ ద్వారా కంపెనీ ఈ కొనుగోలు జరపనుంది.

For More News..

కరోనాతో అంతా ఆన్‌‌‌‌లైన్ బాటలోనే..‌

ఓల్డెస్ట్ మ్యారిడ్ కపుల్ గా గిన్నిస్ రికార్డ్

ఆసియాలోనే ఫస్ట్ టైం.. చనిపోతూ కరోనా పేషెంట్‌కు ప్రాణం పోసిండు