
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆలయాలు తెరుకుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడిన దేవాలయాలు తెరుచుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దైవదర్శనం కోసం పోటెత్తారు. అయతే రాష్ట్రంలోని అతి పురాతన దేవాలయమైన కాళీఘాట్ ఆలయం, కాథడ్రల్ చర్చిలను తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అన్ని దేవాలయాలతో పాటు కాళీఘాట్ గుడి కూడా తెరిచారనుకున్న భక్తులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయితే గుడి తలుపులు మూసి ఉండటంతో నిరాశ చెందారు. బయటి నుంచే దేవుడ్ని మొక్కుకుని వెనుదిరిగారు భక్తులు.