జూన్ 1 నుంచి పశ్చిమ బెంగాల్ లో ప్రార్థ‌నా మందిరాల‌కు అనుమ‌తి

జూన్ 1 నుంచి పశ్చిమ బెంగాల్ లో ప్రార్థ‌నా మందిరాల‌కు అనుమ‌తి

లాక్ డౌన్ తో అన్ని ఆలయాలపై ఎఫెక్ట్ పడింది. అయితే ఈ నెల 31తో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. దీంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు గ్రీన్ సిగ్నలిచ్చారు. దీనికి సంబంధించి ప్రకటన జారీ చేశారు. అయితే వీటిలో 10 మంది భక్తుల కన్నా ఎక్కువ ప్రవేశించేందుకు అనుమతి లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

మరోవైపు జూన్ 8వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పనిచేసుకోవచ్చని తెలిపారు మమతా.ఆన్ లైన్ మీడియా సమావేశంలో మాట్లాడిన దీదీ…గత రెండు నెలలుగా కరోనాను అరికట్టడంలో పశ్చిమ బెంగాల్ విజయం సాధించిందని తెలిపారు. అయితే… ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి జనాలు వస్తుండటంతో లేటెస్టుగా కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు.