అనుకోని అదృష్టం అతిధి రూపంలో వస్తే

అనుకోని అదృష్టం అతిధి రూపంలో వస్తే

ఒక్కఫోటో అతని జీవితాన్ని మార్చేసింది. నాలుగేళ్ల క్రితం రోడ్డు పక్కన చాయ్ వాలాగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అదృష్టం రూపంలో అనుకోని అతిధి తాను చాయ్ చేస్తున్న ఫోటోను తన కెమోరాతో బంధించాడు. అంతే నాడు నీలికళ్లతో అచ్చం మోడల్ గా కనిపించిన చాయ్ వాలా ఎంత పాపులర్ అయ్యాడో మనకు తెలియంది కాదు. ఒక్క ఫోటోతో నైటుకు నైటే స్టారడమ్ సంపాదించాడు. అతనే పాకిస్తాన్ చాయ్ వాలా హర్షద్ ఖాన్.

2016లో పాకిస్తాన్ కు చెందిన ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ జిహాద్ అలీ ఇస్లామాబాద్ గల్లీలో బ్లూ కుర్తాలో నీలి రంగు కళ్లతో చాయ్ కాస్తున్న హర్షద్ ఖాన్ ను ఫోటోలు తీశాడు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ దెబ్బతో చాయ్ వాలా కాస్తా పబ్లిక్ ఫిగర్ అయ్యాడు. రకరకాల యాడ్స్, మోడలింగ్స్, సినిమాలు ఇలా అన్నీ అవకాశాలు ఒక్కసారిగా వెతుక్కుంటూ వచ్చాయి.

కాలం గిర్రున తిరిగింది. హర్షద్ ఖాన్ ఆర్ధిక పరిస్థితులు మారాయ్. నాడు చాయ్ వాలాగా ఉన్న హర్షద్ ఖాన్ నేడు అదే ఇస్లామాబాద్ లో కేఫ్ చాయ్ వాలా రూఫ్ టాఫ్ తో ఓ కేఫ్ ను ప్రారంభించాడు. ఈ నాలుగేళ్లలో తాను సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలతో ఏమాత్రం పొంగిపోని హర్షద్..నీ కేఫ్ పేరు ఎందుకు అలా పెట్టావ్. హర్షద్ ఖాన్ అని పేరు పెట్టొచ్చుకదా అన్న నెటిజన్లకు. నేను ప్రపంచానికి చాయ్ వాలాగా పరిచయం అయ్యా. చాయ్ వాలాగే తన బ్రాండ్ ను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు ఈ పాకిస్తాన్ చాయ్ వాలా హర్షద్ ఖాన్