గొప్ప మనసు చాటుకున్న భువీ.. పిల్లల చదువుకు ఆర్థిక సాయం!

గొప్ప మనసు చాటుకున్న భువీ.. పిల్లల చదువుకు ఆర్థిక సాయం!

టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురుకుల ఆశ్రమానికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. పిల్లల చదువు కోసం ఈ డబ్బును విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పిల్లల చదువుల కోసం భువీ..  గురుకుల ఆశ్రమానికి రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే, భువీ.. ఇలా సాయం చేయడం తొలిసారి కాదు. 2013లో ఉత్తరాఖండ్‌ను భారీ వరదలు ముంచెత్తినప్పుడు తన వంతు సాయం చేశాడు. కాగా, పేలవ ఫామ్‌తో భువీ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ భువీ ప్రదర్శన అంతంత మాత్రమే. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న భువీ.. 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు.

భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకోకపోతే.. వరల్డ్ కప్ 2023 టోర్నీలో భువీ రాణించడంపైనే జట్టు విజయాలు ఆధారపడి ఉన్నాయి.