Shreyas Iyer: సిడ్నీకి అయ్యర్ పేరెంట్స్.. త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు!

Shreyas Iyer: సిడ్నీకి అయ్యర్ పేరెంట్స్.. త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు!

టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వెనక్కి పరిగెడుతూ శ్రేయాస్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ అందుకున్న తర్వాత శ్రేయాస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మైదానం నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు గాయంపై పెద్దగా ఆందోళన లేకపోయినా.. ఆ తర్వాత రోజు వైద్య పరీక్షల్లో శ్రేయాస్ కు  అంతర్గతంగా రక్తస్రావం అయినట్లు డాక్టర్లు గుర్తించారు. అతడికి  ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)చికిత్స అందిస్తున్నారు.

మూడో వన్డే ముగిసిన తర్వాత స్కానింగ్‎లో అయ్యర్ ప్లీహానికి గాయమైనట్లు తేలింది. రాబోయే 48 గంటల్లో రక్తస్రావం తగ్గకపోతే.. అతడికి వారం రోజుల వరకు రెస్ట్ అవసరమం ఉంటుందని డాక్టర్లు సూచించారు. "అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. సిడ్నీ, ఇండియాలోని నిపుణులతో సంప్రదించి బీసీసీఐ వైద్య బృందం అతని గాయం స్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. అయ్యర్ రోజువారీ పురోగతిని అంచనా వేయడానికి భారత జట్టు వైద్యుడు శ్రేయాస్‌తో కలిసి సిడ్నీలోనే ఉంటారు’’ అని బీసీసీఐ తెలిపింది. 

►ALSO READ | శ్రేయస్ అయ్యర్ హెల్త్ కండిషన్‎పై బీసీసీఐ కీలక ప్రకటన

అయ్యర్ గాయపడడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కొందరూ మెసేజ్ లు పెడుతుంటే.. త్వరలోనే భారత జట్టులో నిన్ను చూడాలని ఆశిస్తున్నాం అని ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఊహించని ఈ గాయం మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది అని కొందరు చెబుతున్నారు. బీసీసీఐ సహకారంతో త్వరలో అయ్యర్ తల్లితండ్రులు కూడా సిడ్నీకి వెళ్లనున్నారు. త్వరలో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కు శ్రేయాస్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సౌతాఫ్రికా సిరీస్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయ్యర్ కు ఎక్కువగా రెస్ట్ కావాలని వైద్యులు సూచిస్తున్నారు.

క్యారీ క్యాచ్ పడుతూ గాయం:
 
సిడ్నీ వేదికగా శనివారం (అక్టోబర్ 25) ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ 34 ఓవర్ నాలుగో బంతి ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బాల్ గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‎లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ వెనక్కి వేగంగా పరిగెత్తాడు. అసాధ్యమనుకున్న క్యాచ్‎ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆశ్చర్యానికి గురి చేసిన అయ్యర్ గాయపడ్డాడు. డైవ్ చేసినప్పుడు అతని భుజం నేలకు బలంగా తాకింది. దీంతో గ్రౌండ్‎లోనే  నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో గ్రౌండ్ వదిలి వెళ్ళాడు.