సాగర్ డ్యామ్ను సందర్శించిన 24 దేశాల ప్రతినిధులు

సాగర్ డ్యామ్ను సందర్శించిన 24 దేశాల ప్రతినిధులు

హాలియా, వెలుగు: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ను మంగళవారం వివిధ దేశాలకు చెందిన పర్యావరణ ప్రతినిధులు సందర్శించి సందడి చేశారు.  స్విట్జర్లాండ్, భూటాన్,ఈజిప్టు, ఇథియోపియా, కాంగో, ఫిజీ, గాంబియా, లైబీరియా, మయన్మార్, నేపాల్, నైజీరియా, సౌత్ సుడాన్, టాంజానియా, ఉగాండ, జింబాబ్వే తదితర 24 దేశాలకు చెందిన ప్రతినిధులకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎన్విరాన్ మెంట్  ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో 14 రోజులుగా ప్రాజెక్టుల అభివృద్ధి,- పర్యావరణం, సామాజిక ప్రభావం- అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులు సాగర్ ప్రాజెక్టును, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించగా.. డ్యామ్ వివరాలను అధికారులు తెలియజేశారు. అనంతరం డ్యామ్ అధికారులు, పోలీసులతో సెల్ఫీలు దిగారు. సాగర్ ప్రాజెక్ట్ ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. విదేశీయుల వెంట ఇరిగేషన్ జేఈఈలు కృష్ణయ్య, సత్యనారాయణ, ప్రసాద్, సాగర్ సీఐ శ్రీను నాయక్, ఎస్ పీఎఫ్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాసరావు నాయుడు, విజయపురి ఎస్ఐ ముత్తయ్య, ఎస్ పీ ఎఫ్ ఎస్ఐ రఘు తదితరులు ఉన్నారు.