- మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు : రష్యాకు చెందిన ఏసీఈ ల్యాబ్‌హైదరాబాద్ లో ఫోరెన్సిక్సెంటర్, మాన్యుఫ్యాక్చరింగ్హబ్ఏర్పాటుకు ముందుకు వచ్చింది. జూమ్టెక్నాలజీస్తో కలిసి ఈ సెంటర్ఏర్పాటు చేయనుంది. మంగళవారం సెక్రటేరియెట్ లో ఏసీఈ ల్యాబ్ సీవోవో మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. తాము ఏర్పాటు చేయనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలపై మంత్రితో చర్చించారు.
తమ సంస్థ129 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకుందని చెప్పారు. డేటా లాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రతినిధులను శ్రీధర్ బాబు అభినందించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
శ్రీధర్ బాబుతో టిబెట్ప్రతినిధుల సమావేశం
టిబెటన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును సెక్రటేరియెట్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. టిబెట్ కు సార్వభౌమాధికారాన్ని కల్పించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో మాంక్ గేశే అతుక్ సెతాన్, ఎంపీ సెరింగ్ యంఘ్చెన్ తదితరులు ఉన్నారు.
