మీరు ముందువెళ్లండి..తర్వాతే నేనొస్తా గబ్బర్ సింగ్ నేగీ

మీరు ముందువెళ్లండి..తర్వాతే నేనొస్తా గబ్బర్ సింగ్ నేగీ

న్యూఢిల్లీ : "నేను సీనియర్​ను. టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నుంచి అందరూ బయటకు వెళ్లాకే నేనొ స్త. నాతోటి వారందరిని ముందు పంపుతా".. ఉత్తరాఖండ్ టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిక్కుకున్న ఓ కార్మికుడి మాటలివి. ఆయన పేరే గబ్బర్ సింగ్ నేగీ. ఆయన తన స్ఫూర్తివంతమైన మాటలతో టన్నెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనతోపాటు చిక్కుకున్న 40 మందిలో  స్థైర్యాన్ని నింపారు. సొరంగంలో ఉన్నన్ని రోజులు తోటి కార్మికులకు యోగా, ధ్యానం చేయించారు. బాధితులంతా ఆరోగ్యంగా ఉండేలా చూసుకున్నారు. అందరికీ ధైర్యం నూరిపోశారు. నేగి ధైర్యాన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు.


టన్నెల్​లో ఎలా గడిపామంటే..ప్రధాని మోదీకి వివరించిన వర్కర్లు

న్యూఢిల్లీ :  ప్రభుత్వం తమను కాపాడుతుందన్న ధైర్యంతోనే ఉన్నామని, ఆందోళన చెందలేదని ప్రధాని మోదీతో టన్నెల్ వర్కర్లు అన్నారు. క్షేమంగా బయటకొచ్చిన వర్కర్లతో మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్​లో మోదీ మాట్లాడారు. ‘‘మీరంతా క్షేమంగా బయటకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 17 రోజులంటే మామూలు విషయం కాదు. మీరందరూ ఎంతో ధైర్యంగా ఉన్నారు” అని వర్కర్లను మోదీ ప్రశంసించారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ.. ‘‘మన ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న మనోళ్లనే కాపాడింది. అలాంటిది మనల్ని కాపాడదా? అనే ధైర్యంతో ఉన్నాం. ఆందోళన చెందలేదు. మాలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రతిరోజూ యోగా చేశాం. రోజూ ఉదయం టన్నెల్​లో వాకింగ్ చేశాం” అని వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం పుష్కర్ సింగ్ ధామి, రెస్క్యూ టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు.