మరోసారి వడ్డీ రేటు పెంచిన రిజర్వ్ బ్యాంక్

మరోసారి వడ్డీ రేటు పెంచిన రిజర్వ్ బ్యాంక్

రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అంచనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్లు పెంచింది. రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 6.25శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం వరుసగా ఐదోసారి. ద్రవ్యోల్బణం కట్టడి, ఆర్థికవృద్ధి నెమ్మదించడం తదితర కారణాలతో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును కాస్త తగ్గించినట్లు తెలుస్తోంది. 

ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే వడ్డీ రేట్లు పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ రేటు 6.7 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది.

ఈ ఏడాది మేలో ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత జూన్, ఆగస్టు, సెప్టెంబర్ లోనూ 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 2019 ఏప్రిల్ నాటి గరిష్ఠానికి చేరింది.