
GO 317 పై కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని.. టీచర్లకు అన్యాయం చేస్తున్న ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తెచ్చిన ఆ GOతో ఉపాధ్యాయులంతా కన్నతల్లి, జన్మభూమికి దూరమై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉపాధ్యాయుల ఆందోళనపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
317 GO రద్దు డిమాండ్ తో నిన్న(బుధవారం) హైదరాబాద్ ధర్నాచౌక్ దగ్గర మహాధర్నాకు తరలివచ్చిన టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. చాలా మంది టీచర్లను నిర్బంధంలోకి తీసుకున్నారు.
మరిన్ని వార్తల కోసం..