న్యూజెర్సీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

న్యూజెర్సీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్  ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనకు కాంగ్రెస్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

వేడుకల్లో రేవంత్‌‌‌‌తో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, హర్యానా రాజ్యసభ సభ్యుడు దీపేందర్ హుడా, ఇండియన్  ఓవర్సీస్  నేతలు రాజేశ్వర్ రెడ్డి, ప్రదీప్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఆదివారం న్యూయార్క్‌‌‌‌లో రాహుల్‌‌‌‌  గాంధీతో నిర్వహించనున్న ఎన్నారైల ఇంటరాక్షన్  కార్యక్రమంలోనూ రేవంత్ పాల్గొననున్నారు.‌‌‌‌ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్  మధు యాష్కీ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.