అవకాశవాదమే తప్ప.. ఆత్మగౌరవం పట్టదా?

అవకాశవాదమే తప్ప.. ఆత్మగౌరవం పట్టదా?

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు విమర్శలకు దిగారు. రాజకీయ అవసరాల కోసం తప్ప తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎప్పుడైనా గొంతెత్తవా అని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. పార్లమెంటులో పదేపదే మోడీ తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరుస్తుంటే సోయి లేదా అని క్వశ్చన్ చేశారు. అవకాశవాదమే తప్ప.. ఆత్మగౌరవం పట్టదా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోడీ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అమరవీరులను అవమానించారని మండిపడ్డారు. అమరవీరులకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో మోడీ చేసిన ప్రసంగం రెండు వాస్తవాలను బయటపెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ తప్ప టీఆర్ఎస్ కాదని.. బీజేపీ తెలంగాణను ద్వేషిస్తుందని, ఆ పార్టీ రాష్ట్రం కోసం ఏమీ చేయలేదని రుజువైందన్నారు.

మరిన్ని వార్తల కోసం:

కేటీఆర్.. అప్పుడు ఎక్కడ దాక్కున్నరు?

బీజేపీలో చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్

ఏ బట్టలు ధరించాలనేది ఆడవాళ్ల ఇష్టం