
మునుగోడులో తమకు 35వేల నుంచి 40 వేల ఓట్లు వస్తాయనుకున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నిక వేలంపాట కంటే అద్వానంగా జరిగిందన్నారు. నెలరోజుల్లో రూ. 300 కోట్ల లిక్కర్ అమ్ముడుపోయిందంటే ఎన్నికకు ఎంత ఖర్చు పెట్టారో అర్థం చేసుకోవాలన్నారు.
తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని రేవంత్ అన్నారు. మునుగోడు ఎన్నికలో రాహుల్ ను ఇన్వాల్ చేయొద్దని ముందే అనుకున్నామన్నారు. పార్టీలో చాలా మంది పదవులు అనుభవించిన వాళ్లు పార్టీ మారినా ఎవరు మాట్లడలేదు కానీ.. తాను వచ్చాక డిపాజిట్లు రానివాళ్లు పోతే బాగా ప్రచారం చేశారన్నారు. మేధావులని వారికివారే అనుకుంటే తానేమీ చేయలేనని రేవంత్ అన్నారు.
రాహుల్ యాత్రను ప్రధాని మోడీ, అమిత్ షా లిద్దరు సీరియస్ గా పరిశీలిస్తున్నారని రేవంత్ అన్నారు. సౌత్ ఇండియాలో రాహుల్ యాత్ర ముగియగానే మోడీ రంగంలోకి దిగిండన్నారు. సౌత్ ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటనలు పెట్టుకున్నారని చెప్పారు. రాహుల్ ఓ లక్ష్యం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని.. ఆ యాత్ర ఏదో ఒక ఉప ఎన్నికనో .. ఒక రాష్ట్ర ఎన్నికల కోసమో కాదన్నారు.