అక్రమ దందాలతో దేశ ప్రయోజనాలకు భంగం

అక్రమ దందాలతో దేశ ప్రయోజనాలకు భంగం
  • ఎఫ్​ఎంసీజీ, మొబైల్​, టొబాకో, ఆల్కహాల్ ​బిజినెస్​లలో పన్ను ఎగవేత

న్యూఢిల్లీ: ఎఫ్​ఎంసీజీ, మొబైల్​, టొబాకో, ఆల్కహాల్​ బిజినెస్​లలో పన్ను ఎగవేత వల్ల 2019–20లో ఖజానాకు రూ. 58,521 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. అయిదు కీలక రంగాలలోనే ఎగవేత ఎక్కువగా ఉన్నట్లు ఈ రిపోర్టు గుర్తించింది. ఎగవేత ఎక్కువగా ఉన్న అయిదు రంగాలలో ఆ ఏడాదిలో రూ. 2.60 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ఈ రిపోర్టులో ఫిక్కి తెలిపింది. విలువపరంగా చూస్తే, ఒక్క ఎఫ్​ఎంసీజీ వ్యాపారంలోనే 75 శాతం అక్రమ దందా జరిగిందని పేర్కొంది. ఈ అక్రమ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 58,521 కోట్ల మేర పన్ను వసూలు కాకుండా పోయినట్లు వివరించింది. అక్రమ దందాలు దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని రిపోర్టులో ఫిక్కి పేర్కొంది. పన్ను ఎగవేత పరంగా చూస్తే, టొబాకో, ఆల్కహాల్​ బిజినెస్​ల వల్ల 49 శాతం శాతం పన్ను ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్లు ఈ రిపోర్టు గుర్తించింది. అంతేకాదని, ఇలాంటి అక్రమ దందాల వల్ల రావల్సిన ఉద్యోగాలు రాకుండా పోతాయని పేర్కొంది. ఎఫ్​ఎంసీజీ ప్యాకేజ్డ్​ ఫుడ్స్​ ఇండస్ట్రీలో 7.94 లక్షల ఉద్యోగాలు, టొబాకో ఇండస్ట్రీలో 3.7 లక్షల ఉద్యోగాలు, ఎఫ్​ఎంసీజీ  హౌస్​హోల్డ్​ అండ్​ పర్సనల్​ గూడ్స్​ ఇండస్ట్రీలో 2.98 లక్షల ఉద్యోగాలు, ఆల్కహాలిక్​ బెవరేజెస్​ ఇండస్ట్రీలో 97 వేల ఉద్యోగాలు, మొబైల్​ ఫోన్​ ఇండస్ట్రీలో 35 వేల ఉద్యోగాలు ఇలా రాకుండా పోయినట్లు ఫిక్కి రిపోర్టు వివరించింది.
 
అయిదు రంగాలు..
అక్రమ దందాలతో అయిదు రంగాలలో ఎగవేత బాగా ఎక్కువగా ఉందని చెబుతూ, ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్​ ఫుడ్స్​ ఇండస్ట్రీలో రూ. 17,074 కోట్లు, ఆల్కహాలిక్​ బెవరేజెస్​ బిజినెస్​లో రూ. 15,262 కోట్లు, టొబాకో ప్రొడక్టులలో రూ. 13,331 కోట్లు, ఎఫ్​ఎంసీజీ  హౌస్​హోల్డ్​ అండ్​ పర్సనల్ గూడ్స్​ బిజినెస్​లో రూ. 9,995 కోట్లు, మొబైల్​ ఫోన్ల ఇండస్ట్రీలో రూ. 2,859 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగిందని ఫిక్కి రిపోర్టు వివరించింది. ఈ పరిశ్రమలు లేదా వ్యాపారాలకు ఇతర రంగాలతో ఉన్న సంబంధాల వల్లే ఎగవేత అధికమవుతున్నట్లు పేర్కొంది. అక్రమ దందాల మార్కెట్​ సైజు మొత్తం రూ. 2.60 లక్షల కోట్ల దాకా ఉన్నట్లు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఎఫ్​ఎంసీజీ (హౌస్​హోల్డ్​ అండ్​ పర్సనల్​ గూడ్స్​, ప్యాకేజ్డ్​ఫుడ్స్​) వాటానే రూ.1.97 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనావేసింది. రూ. 23,466 కోట్లతో ఆల్కహాలిక్​ బెవరేజెస్​, రూ. 22,930 కోట్లతో టొబాకో ప్రొడక్ట్స్​, రూ. 15,884 కోట్లతో మొబైల్​ ఫోన్ల బిజినెస్​లు ఆ తర్వాత ప్లేస్​లలో నిలుస్తున్నాయని వివరించింది. దేశీయంగా మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్​ను బలోపేతం చేయాలంటే ఇలాంటి అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయడం అవసరమని ఫిక్కి రిపోర్టు అభిప్రాయపడింది. ఇందుకు ప్రభుత్వం, పరిశ్రమ రంగాలు, వినియోగదారులు, అంతర్జాతీయ సంస్థలు ..అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించింది.