
హైదరాబాద్, వెలుగు: సిటీలో ట్రాఫిక్ జరిమానాలను సవరించినట్లు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ శనివారం ఓ ప్రకటకలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం నివారణ కోసం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై భారీ జరిమానాలు విధించనున్నామన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారికి రూ.1,700, ట్రిపుల్ రైడింగ్ చేసే వారికి రూ.1,200 ఫైన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 27 వరకు అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. 28 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఆయన చెప్పారు.