బీఆర్‌‌ఎస్‌‌కు కాలం చెల్లింది : రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి

బీఆర్‌‌ఎస్‌‌కు కాలం చెల్లింది : రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి

ఆత్మకూరు (దామెర), వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి తెలంగాణలో కాలం చెల్లిందని పరకాల కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళిత ద్రోహి చల్లా ధర్మారెడ్డికి తగిన బుద్ధి చెప్పి, తెలంగాణలో కాంగ్రెస్‌‌ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ధర్మారెడ్డికి కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ నియోజకవర్గ సమస్యలపై లేదన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.