బీజేపీ గ్రాఫ్ పడిపోయింది..కాంగ్రెస్లో చేరుతా : రేవూరి

బీజేపీ గ్రాఫ్ పడిపోయింది..కాంగ్రెస్లో చేరుతా : రేవూరి

కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు  బీజేపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి.  రాహుల్ గాంధీ, ప్రియాంఖ సమక్షంలో అక్టోబర్ 18న కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గత నాలుగు నెలలుగా  రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ లో ఉండే గ్రూపు రాజకీయాలు బీజేపీకి పాకాయన్నారు.   బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శించారు.

 బండి సంజయ్  తొలగింపును తప్పుబట్టారు రేవూరి ప్రకాశ్ రెడ్డి. బండి సంజయ్ వల్లే బీజేపీ ఊరురా వెళ్లిందన్నారు. బండి సంజయ్ తొలగింపుతో బీజేపీ సెల్ఫ్ గోల్ ఆడిందన్నారు రేవూరి.  బీఆర్ఎస్  కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని చెప్పారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు తనను కలిసినట్లు తెలిపారు.  రేవూరి  పరకాల నుంచి పోటీ  చేసే అవకాశం ఉంది.    

గత ఎన్నికల్లో టీడీపీ తరపున వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. గత కొన్ని రోజులుగా బీజేపీతో అంటీమూట్టనట్టుగా ఉంటున్నారు. అక్టోబర్ 15న రేవంత్ రెడ్డి,  మల్లు రవితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.