వరంగల్ నిట్ లైబ్రరీలో కొత్త టెక్నాలజీ

వరంగల్ నిట్ లైబ్రరీలో కొత్త టెక్నాలజీ
  • లైబ్రరీ బుక్స్ సేవలన్నీ ‘ఓ ప్యాక్’ యంత్రం ద్వారానే
  • పుస్తకాలు తీసుకోవడం.. రిటర్న్ చేయడం.. గడువు రెన్యువల్ చేసుకోవడం అన్నీ మిషన్ ద్వారానే
  • వరంగల్ నిట్ లో 1 లక్షా 85 వేల  పుస్తకాలు
  • ప్రతి పుస్తకానికి QR కోడ్, ఎలక్ట్రానిక్ చిప్

లైబ్రరీలోని పుస్తకాలను అవసరమైన టైమ్ లో వేగంగా వెతికి తీసుకునేలా కొత్త మిషన్ ను ఏర్పాటు చేశారు వరంగల్ నిట్ అధికారులు. పుస్తకాలు పోకుండా, తారుమారు కాకుండా రక్షణ చర్యలు చేపట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. డబ్బులు అర్జెంట్ గా తీసుకోవాలన్నా...డిపాజిట్ చేయాలన్నా మనం ఏటీఎం సెంటర్ కు వెళ్తాం. ఇదే తరహాలో మనకు అవసరమైన పుస్తకాలు తీసుకోవడానికి, వాటిని రిటర్న్ చేయడానికి మిషన్ తయారు చేశారు వరంగల్ నిట్ లైబ్రరి అధికారులు. ఆన్ లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాటలాగ్ యంత్రంపై ఐడీ కార్డు స్కాన్ చేస్తే చాలు...అవసరమైన పుస్తకాలు తీసుకోవచ్చు. ఏ టైంలోనైనా పుస్తకాలను రిటర్న్ చేయవచ్చు.

ఓ  ప్యాక్ మిషన్ లో ఎంటర్ చేస్తే సరి

దేశ, విదేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్ధులు వరంగల్ నిట్ లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ స్టూడెంట్స్ కోసం 1 లక్షా 85 వేల  పుస్తకాలతో అధునాతన లైబ్రరీని ఏర్పాటు చేశారు అధికారులు.ఇంతకుముందు నిట్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవాలంటే రికార్డు బుక్ లో పేరు, ఐడీ నమోదు చేసి.. మ్యానువల్ గా తీసుకునేవాళ్లు. ఇప్పుడా అవసరం లేకుండా పుస్తకాలు తీసుకునేందుకు మిషన్ ను తయారు చేశారు. ఓ ప్యాక్ అనే యంత్రంలో ఐడీ కార్డు స్కాన్ చేసి అప్షన్ లో పుస్తకం పేరు ..లేదా కోడ్ ఎంటర్ చేయగానే అ బుక్ ఏ ర్యాక్ లో ఉందో తెలిసి పోతుంది.అక్కడికెళ్లి పుస్తకం తీసుకొని ఓ  ప్యాక్ మిషన్ లో ఎంటర్ చేస్తే సరిపోతుంది.

ముట్టినట్లుగా రసీద్ ఇస్తుంది

పుస్తకం తిరిగి అప్పగించాలనుకుంటే లైబ్రరీ బయట డ్రాప్  బాక్స్  లో పెడితే మిషన్ లోనికి తీసుకొని, ముట్టినట్లుగా రసీద్ ఇస్తుంది. ఆర్ ఎఫ్ ఐ డీ టెక్నాలజీతో అల్మారలో పుస్తకాలు తారు మారైనప్పుడు స్కానర్  సాయంతో ఎక్కడున్నా గుర్తించే అవకాశం ఉంది. కంప్యూటర్ లో పుస్తకం కోడ్ ఎంటర్  చేసి స్కానర్ చూపిస్తూ పోతే మాయమైన పుస్తకం ఉన్న చోటు పసిగట్టేలా అలారం ఏర్పాటు చేశారు. నిట్ అధికారులు, విద్యార్థులు కలిసి ఈ  ఓప్యాక్ యంత్రాన్ని తయారు చేశారు. 

అలారం మోగేలా..

ఏటీఎం మాదిరి స్టూడెంట్స్ ఐడీ కార్డు సాయంతో ఎప్పుడైనా ఈ మిషన్ ద్వారా బుక్  తీసుకోవచ్చు. ఇందులో ఇష్యూ, రెన్యూవల్, రిటన్, అకౌంట్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. పుస్తకం తిరిగి ఇవ్వాలనుకునే వారు రిటర్న్, కొత్తగా తీసుకునే వారు ఇష్యూ ఆప్షన్, గడువు పొడగింపునకు రెన్యువల్ ఆప్షన్ ఎంటర్ చేసి తీసుకోవచ్చు. ఒక వేళ యంత్రం దగ్గర పుస్తకం సమర్పించిన తర్వాత నమోదు చేయకుండా అదే పుస్తకం బయటకు తీసుకెళ్తే... ఎంట్రెన్స్ లో అలారం మోగేలా ఏర్పాటు చేశారు. డ్రాప్  బాక్సు దగ్గర కంప్యూటర్  పైన పుస్తకం ఉంచితే వివరాలు కనిపిస్థాయి. సబ్ మిట్ బుక్ ఆప్షన్ ఎంపిక చేస్తే...పుస్తకం లోపలికి వెళ్లి రశీదు బయటకు వస్తుంది. ఆన్ లైన్ లైబ్రరీ విధానం చాలా బాగుందంటున్నారు నిట్ విద్యార్థులు.

ఎలక్ట్రానిక్  మ్యాగ్నటిక్  స్ట్రిప్  

నిట్ లైబ్రరీ పుస్తకాలకు క్యూఆర్  కోడ్, ఎలక్ట్రానిక్  చిప్స్, మ్యాగ్నటిక్స్  గ్రంథాలయంలోని పుస్తకంలో ఎవరికీ కనిపించకుండా ఆర్ ఎఫ్ ఐడీ చిప్ తో పాటు ఎలక్ట్రానిక్  మ్యాగ్నటిక్  స్ట్రిప్  అమర్చారు. బుక్స్ ఎవరైనా వేరే చోట ఉంచినా....స్కాన్ చేయకుండా పుస్తకం తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించినా...అలారం వచ్చేలా పరికరం అమర్చారు. అరుదైన గ్రంథాలు, నిపుణుల రచనలకు చిప్ లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యార్థులకు సులభతరంగా పుస్తకాలు అందజేసేలా టెక్నాలజీని తయారు చేశామని చెబుతున్నారు. ఈ లైబ్రరి విమిన్ తో విద్యార్థులతో పాటు తమకు కూడా చాలా సౌకర్యంగా ఉందని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.