రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిండు

  రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిండు

భూమి వివరాలు రికార్డుల్లో ఎక్కించేందుకు రూ.30 వేలు లంచం అడిగి ఏసీబీకి చిక్కాడు ఆర్‌ఐ. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. కొండమల్లేపల్లిలో  రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు  శ్రీనివాస్‌రెడ్డి.  ఓ రైతు తన భూమి వివరాలు రికార్డుల్లో ఎక్కి్ంచాలని శ్రీనివాస్‌రెడ్డిని కలిశాడు. అందకు శ్రీనివాస్‌రెడ్డి రూ. 30 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు.  దేవరకొండలో రైతు దగ్గరి నుంచి  నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్‌రెడ్డిని పట్టుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.