డబ్బున్నోళ్లు సైతం కరోనా కోరల్లోనే

డబ్బున్నోళ్లు  సైతం కరోనా కోరల్లోనే

బిజినెస్ డెస్క్, వెలుగు: జీవితంపై మన ఆలోచనా విధానాన్ని కరోనా మార్చేసింది. అనారోగ్య సమస్యలను డబ్బున్నవాళ్లు కూడా తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి కల్పించింది. కోట్లు పెట్టినా కార్పొరేట్ ఆస్పత్రిలో ఒక్క బెడ్డు దొరకని పరిస్థితి ఏర్పడింది. మలేరియా, టీబీ, ఎన్సెఫలిటిస్, డయేరియా, డెంగీ వంటి రోగాలతో ఏటా లక్షల మంది పేదలు మరణిస్తున్నారు. ఇవేవీ మీడియాలో వార్తలు కావడం లేదు. మాయదారి కరోనా వైరస్ ఈ పరిస్థితిని మార్చింది.  రిచ్‌‌‌‌‌‌‌‌క్లాస్ పీపుల్‌‌‌‌‌‌‌‌కు ఈ మహమ్మారి వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, ఒబేసిటీ వంటి సమస్యలు రిచ్, అప్పర్ మిడిల్‌‌‌‌‌‌‌‌ క్లాస్ వారిలో ఎక్కువ. కరోనా వీరినే పట్టుకుంటోంది. ఇలాంటి లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ వ్యాధులు ఉన్న వారికి కరోనా అంటుకుంటే ప్రాణాంతకంగా మారుతోంది. మురికివాడల్లో ఉండేవాళ్లు సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు కట్టుకోవడం, శానిటైజర్లు వాడటం ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌గా కుదిరే పనికాదు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి!  ధనవంతులు డూప్లెక్సుల్లో ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లలో ఉంటున్నా, ప్రాణాలకు గ్యారంటీ కనిపించడం లేదు. కరోనా రాక్షసి అన్ని వర్గాలనూ బలిగొంటున్నది. ఆకలి, అనారోగ్యం, అపరిశుభ్రత వల్ల పేదలు మరణిస్తే, లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ జబ్బులు, కరోనా డబ్బునోళ్ల ప్రాణాలను తీస్తున్నాయి. 

అందరికీ అవగాహన ఉంది..

‘‘మా అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇప్పుడు టెంపరరీ స్లమ్‌‌‌‌‌‌‌‌గా మారిపోయింది. కింద ఉన్న చిన్న రూముల్లో వందల మంది కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటున్నారు. వీళ్ల భార్యలు, పిల్లలు ఇండ్లలో నౌకర్లుగా చేస్తారు. అందరికీ ఒకే టాయిలెట్! మీలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చిందా అని అడిగాను. లేదన్నారు. అయితే ఏదో జరుగుతోందని మాత్రం వారికి తెలుసు. రోజూ సెక్యూరిటీ పోస్టు దగ్గర టెంపరేచర్లు చెక్ చేయించుకుంటున్నారు. మాస్కులు పెట్టుకుంటున్నారు. అపార్టుమెంట్‌‌‌‌‌‌‌‌లలో ఎవరికైనా కరోనా వస్తే.. టెస్టులు చేయించుకోవాలని నౌకర్లను యజమానులు అడుగుతున్నారు. టెస్టులు, కౌన్సెలింగ్ కోసం వాళ్లు ఎక్కడికి వెళ్లాలి? పాజిటివ్ వచ్చినా క్వారంటైన్లో ఉండగలరా ? పాన్ డబ్బాల్లా ఉండే గదుల్లో సోషల్ డిస్టెన్స్ ఎక్కడిది ? మనదేశంలో రిచ్‌‌‌‌‌‌‌‌క్లాస్‌‌‌‌‌‌‌‌కే కాస్త ప్రొటెక్షన్ ఉంది. గరీబోళ్లను ఎవడు కేర్ చేస్తడు ?” అని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన హరిప్రసాద్ తన అపార్టుమెంట్లో పరిస్థితిని వివరించారు. అయితే, ప్రసాద్ చెప్పినట్టు డబ్బున్నోళ్లు గుండె మీద చెయ్యేసుకొని ఏసీ రూమ్‌‌‌‌‌‌‌‌లో హాయిగా నిద్రించే పరిస్థితి కూడా లేదు. మొదట్లోనే వైరస్‌‌‌‌‌‌‌‌ను అందరం నిర్లక్ష్యం చేశాం. ఇప్పుడు సెకండ్‌‌‌‌‌‌‌‌వేవ్ ఎవ్వరినీ వదలడం లేదు. అందరం కలిసి దీనిపై పోరాటం చేయడం తప్ప వేరే మార్గమే లేదు.

ఎన్నో తేడాలు...

ప్రాంతాలను బట్టి కూడా ఇమ్యూనిటీ లెవెల్స్‌‌‌‌‌‌‌‌లో తేడాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికాలోని లక్షల మంది నల్లజాతీయులు (ఆఫ్రికన్లు) కరోనాతో మరణించారు. అయితే ఆఫ్రికాలోని ఘనా, నైజీరియా వంటి దేశాల జనాన్ని కరోనా పెద్దగా ఏమీ చేయలేకపోతోంది. అంటే డబ్బున్న దేశాల ప్రజలు సేఫ్‌‌‌‌‌‌‌‌గా ఉంటారనే నమ్మకం తప్పని రూఢీ అవుతోంది. మనదేశంలో మహారాష్ట్రలో అతి ఎక్కువగా కేసులు రికార్డవుతున్నాయి. ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావి ఇదే సిటీలో ఉంది. ఇక్కడ మాత్రం కరోనా బారిన పడుతున్న సంఖ్య సాధారణ జనంతో పోలిస్తే తక్కువ ఉంది. కారణం చెప్పడం చాలా ఈజీ. వీళ్లు రోజంతా కష్టపడతారు. బద్ధకం అనే మాటే ఉండదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సైన్స్, సమాజం, పొలిటికల్ లీడర్లు విధానాలను తయారు చేయాలి. రోడ్లపై చిన్న వ్యాపారులను తరిమేస్తే లాభం లేదు. డబ్బు కరోనాకు ప్రూఫ్ కాదు,  లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ మార్చుకోవాలి.

‘‘డబ్బున్నోడికి కరోనా వచ్చినా ఏమీ కాదు. హాయిగా ఇంట్లో తొంగొని నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్ చూస్తూ ఉంటాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని నచ్చినవి తింటాడు. ఇంకా ఎక్కువ ఇబ్బంది అయితే అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ను పిలిపించుకొని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తాడు. ఎటొచ్చీ గరీబోడికే ఇబ్బంది. కరోనా వస్తే చావే దిక్కు!”సంపన్నుల గురించి చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉండొచ్చు కానీ ఇవేవీ నిజాలు కావని కరోనా రక్కసి ప్రూవ్ చేసి చూపించింది. రోగాలకు ధనిక పేద తేడాలు ఉండవని, సమస్య వస్తే సామాన్యుడితోపాటు ఉన్నతవర్గాలు ఇబ్బంది పడకతప్పదని ఈ చిన్న వైరస్ చాటిచెబుతోంది. మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇమ్యూనిటీని పెంచుకోవడమే.