ఇండియాలో ఆడవాళ్లకు రక్షణ లేదు: రిచా చద్దా

ఇండియాలో ఆడవాళ్లకు రక్షణ లేదు: రిచా చద్దా

రిచా చద్దా చేసే పాత్రలే కాదు.. ఆమె మాటలు కూడా చాలా బోల్డ్‌ గా ఉంటాయి.విషయం నెగిటివ్ అయినా, పాజిటి వ్ అయినా సూటిగా మాట్లాడటం ఈ బాలీవుడ్ నటి శైలి. ప్రస్తుతం రిచా ‘సెక్షన్ 375’ అనే సినిమా చేస్తోంది. రేప్‌ కి గురైన ఒక ఆడపిల్ల తరఫున వాదించే లాయర్ పాత్ర. ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో మన దేశంలోని మహిళల పరిస్థితిపై ప్రశ్నలు ఎదురయ్యాయి రిచాకి. అప్పుడామె చెప్పిన సమాధానాలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ‘మన దేశం ఎంతో సురక్షితమైనదని కొందరుఅంటుంటారు. అలా ఎలా అంటారో నాకిప్పటికీ అర్థం కాదు. బహుశాఅలా అనేవాళ్లు మగవాళ్లే అయ్యుంటారు. ఎందుకంటే మన దేశంలోపుట్టిన ఏ ఆడపిల్లా అలా అనదు. అనలేదు. ఇక్కడ మనకి రక్షణ లేదు’ అంది.‘వరకట్న హత్యలు, యాసిడ్ అటాక్‌ లు, లైంగిక వేధింపులు.. ఒకటా రెండా,ఎన్ని రకాల హింస జరుగుతోంది. ఆడపిల్లల మీద? చివరికి కడుపులో ఉన్నపిండాన్ని కూడా వదలడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ విధానాలతోపాటు సమాజం కూడా మారాలి. ఆడపిల్ల జోలికి వచ్చిన వాళ్లని వదిలిపెట్టకూడదు. ఎంత పెద్ద వాడైనా సరే శిక్షించి తీరాలి. అక్కడికివెళ్లకండి, అలాంటి బట్టలు వేసుకోకండి అని సలహాలివ్వడంకాదు. ఎక్కడి కెళ్లినా , ఎలా వెళ్లినా ఆడపిల్ల సేఫ్‌ గా ఇంటికితిరిగొచ్చే పరిస్థితులు కల్పిం చాలి’ అంటూ ఆవేశంగా మాట్లాడింది రిచా. ఆమె కోరుకున్న పరిస్థితులు ఎప్పటికి వస్తాయో ఏమో.