వెలుగు స్పెషల్ : ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న లోన్ యాప్స్ 

వెలుగు స్పెషల్ : ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న లోన్ యాప్స్ 

ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు, అత్యవసర అవసరాలకు తక్షణ రుణం, ఇలా లోన్ యాప్‌‌‌‌లను ఆశ్రయించడం నేడు సాధారణమైపోయింది. అత్యవసరానికి తీసుకుంటున్నారో,  అనవసరానికి  తీసుకుంటున్నారో తెలియదు కానీ, రుణం తీసుకున్న తర్వాత ఎదురయ్యే వేధింపులు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

ముఖ్యంగా విదార్థులు అవసరానికి మించి చేసే ఖర్చుల వలన ఇలాంటి లోన్ యాప్స్ బారిన పడుతున్నారు. అధిక వడ్డీలు, దాచిన ఛార్జీలు, అసభ్యకరమైన మాటలు, ఫోన్ కాల్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం చేరవేస్తామనే బెదిరింపులతో రుణగ్రహీతలను మానసికంగా కుంగదీస్తున్నారు. పరువు పోతుందనే భయం, సమాజం ఏమనుకుంటుందోననే ఆందోళనతో కొందరు ఆత్మహత్యల వంటి తీవ్రమైన నిర్ణయాలకు పాల్పడుతున్నారు. 

ఈ పరిస్థితులను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. యాప్ విశ్వసనీయత,  వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు నిబంధనలు పూర్తిగా పరిశీలించాలి. అనవసరమైన యాప్‌‌‌‌లకు కాంటాక్ట్స్, ఫొటోలు, వ్యక్తిగత సమాచారానికి అనుమతులు ఇవ్వకూడదు. వేధింపులకు భయపడి మరిన్ని అప్పులు చేయకూడదు. ఆధారాలను భద్రపరచి సైబర్ క్రైమ్ పోలీసులకు, ఆర్‌‌‌‌బీఐ ఫిర్యాదు వ్యవస్థకు తెలియజేయాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు బాధితులకు అండగా నిలవాలి. అప్పుల సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. పరువు కంటే ప్రాణం విలువైనది. అప్పు తీర్చుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. 

- వై. సంజీవ కుమార్, 
సోషల్ ఎనలిస్ట్‌‌‌‌ 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
  [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.