ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

మల్లాపూర్, వెలుగు: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్​ మండలం రాఘవపేటలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెదిలి ప్రవీణ్ (30) గురువారం ట్రాక్టర్ సాయంతో తన పొలాన్ని దున్నుతున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్‌‌‌‌ అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్‌‌‌‌ కింద చిక్కుకున్న ప్రవీణ్‌‌ స్పాట్‌‌లోనే చనిపోయాడు. తండ్రితోపాటు శ్రీహన్​​(12) ట్రాక్టర్‌‌‌‌పై ఉండగా, అతడి కాలువిరిగింది. వారిని సమీప రైతులు మెట్‌‌పల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.