రోడ్డు ప్రమాదంలో గాయపడితే...లక్షన్నర వరకు ఉచిత వైద్యం..ఎలా అంటే.?

రోడ్డు ప్రమాదంలో గాయపడితే...లక్షన్నర వరకు ఉచిత వైద్యం..ఎలా అంటే.?

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఆదేశాలు  మే 5 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. గత జనవరిలో రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్​లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకానికి క్యాష్​ లెస్ ట్రీట్​మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం– 2025గా కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది. 

పథకంలోని అంశం

    

  • మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద హాస్పిటల్​లో రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందడానికి అర్హులు అవుతారు. 
  • ఈ సేవలు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల వరకు పొందవచ్చు. 
  • ఈ నోటిఫికేషన్​లో బాధితుల కోసం ట్రామా, పాలీట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని హాస్పిటళ్లనూ ఈ పథకం కిందకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 
  •  ఈ నోటిఫికేషన్ ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుణ్ని హాస్పిటల్​కు తీసుకువచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్​లో సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో హాస్పిటల్​కు పంపించాల్సి ఉంటుంది. అందుకోసం సదరు హాస్పిటల్ వారే రవాణా సౌకర్యాలు కల్పించాలి.
  • హాస్పిటల్ నుంచి బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన హాస్పిటల్ అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్​లో అప్లోడ్ చేసి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  •