
ముంబై: రోడ్లకు గుంతలు పడ్డయని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ).. కాంట్రాక్టర్లకు భారీ పెనాల్టీ విధించింది. ఆ రోడ్లు వేసిన ఐదుగురు కాంట్రాక్టర్లకు రూ.6.4కోట్ల జరిమానా విధించింది. క్వాలిటీ పాటించడంలో ఫెయిల్ అయినందుకే పెనాల్టీ వేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు.
విపరీతమైన ట్రాఫిక్ ఉండే ముంబైలో రోడ్లన్నీ బాగా డ్యామేజీ అయ్యాయి. వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కిందటేడాది సీఎం ఏక్నాథ్ షిండే సిటీలోని అన్ని రోడ్లను రిపేర్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. అందుకు రూ.6 వేల కోట్లు మంజూరు చేశారు. ఏప్రిల్ నుంచి జులై మధ్య ముంబై రోడ్లలోని 6 వేల గుంతలను పూడ్చారు. అయితే, ఈ మధ్య పడిన వర్షాలకు.. చేసిన రిపేర్లన్నీ కొట్టుకుపోయి రోడ్లన్నీ ఎప్పటిలాగే గుంతలమయం అయ్యాయి. దీంతోఅధికారులు చెక్ చేసి క్వాలిటీ లోపంగా తేల్చారు.