కంచిరావుపల్లి తండాలో నాలుగు ఇండ్లల్లో చోరీ

కంచిరావుపల్లి తండాలో నాలుగు ఇండ్లల్లో చోరీ

పెబ్బేరు, వెలుగు: మండలంలోని కంచిరావుపల్లి తండాలో శుక్రవారం రాత్రి దొంగలు హల్​చల్​ చేశారు. తాళం వేసి ఉన్న నాలుగు ఇండ్లల్లో దొంగలు పడి1.10 కిలోల వెండి, ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు ఎస్సై యుగంధర్​ రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన రాత్లావత్​ వినాయక్​ ఇంటిలో బీరువా పగులగొట్టి ఒకటిన్నర తులాల బంగారు కమ్మలు, ఉంగరం, 40 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లారు. 

రాత్లావత్​ జమ్మలమ్మ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 70 తులాల వెండిని దొంగిలించారు. పీరియా నాయక్​ ఇంటిలోని గల్లా పెట్టెను ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.