రాబిన్ హుడ్ ఆర్మీ.. వెయ్యి గ్రామాల్లో.. 10 లక్షల మందికి భోజనాలు

 రాబిన్ హుడ్ ఆర్మీ.. వెయ్యి గ్రామాల్లో.. 10 లక్షల మందికి భోజనాలు

రాబిన్ హుడ్ ఆర్మీ (RHA)- వాలంటీర్-ఆధారిత జీరో-ఫండింగ్ సంస్థ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుపేద ప్రజలకు సహాయం చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అవసరమైన ప్రజల కోసం కృషి చేస్తోంది. తాజాగా #MissionSwades అనే మరో దాతృత్వ ప్రచారాన్ని అమలు చేయాలని RHA యోచిస్తోంది.

#MissionSwades ద్వారా రాబిన్ హుడ్ ఆర్మీ 1వెయ్యి గ్రామాల్లో 10 మిలియన్ల మందికి భోజనాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. అత్యంత అట్టడుగు జనాభాను లక్ష్యంగా చేసుకుని తోటి పౌరులకు పోషకమైన భోజనం, రేషన్‌లను అందజేస్తోంది. ప్రతి నగరానికి 50 కి.మీ పరిధిలోని 2-5 గ్రామాల మధ్య దత్తత తీసుకునేలా వీరు చూస్తారు. ప్రతి నెలా వందలాది గ్రామాలకు నగరాల ద్వారా నిరంతరం రేషన్ సరఫరా జరిగేలా ఆహారం, లాజిస్టిక్స్, సమీకరణ నెట్‌వర్క్‌లను నిర్మించడం ద్వారా గ్రామీణ భారతదేశానికి దీర్ఘకాలిక విస్తరణను ఏర్పాటు చేయడంపై కూడా మిషన్ దృష్టి సారిస్తోంది.

ఈ మిషన్ స్వేడ్స్ కు అక్షత్ జైన్ నాయకత్వం వహిస్తుండగా.. మనం ఆకలితో పోరాడాలంటే, గ్రామీణ భారతదేశంపై దృష్టి పెట్టడం తదుపరి పునాదిగా ఉండాలని చెబుతారు. #MissionSwadesతో ఈ మిషన్‌ను నిర్మించడానికి సంతోషిస్తున్నామని ఆయన అన్నారు. డిజిటల్ మీడియా సంస్థ మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ (Monk-E) సహకారంతో మిషన్ స్వేడ్స్ ప్రజలకు చేరువయ్యేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం ప్రతి ప్రాంతం నుంచి సపోర్ట్ కోసం వాలంటీర్లను ఏర్పాటు చేస్తోంది.

రాబిన్ హుడ్ ఆర్మీ మిషన్‌లో చిన్న పాత్ర పోషించడంతో పాటు మన దేశంలోని అణగారిన వర్గాలకు సేవలందిస్తున్నందుకు తమకు ఎంతో గౌరవం, ఆనందంగా ఉంది అని మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ యొక్క CEO, సహ వ్యవస్థాపకుడు విరాజ్ షెత్ అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాబిన్ హుడ్ ఆర్మీ గ్రాస్ రూట్ స్థాయిలో ఆకలితో పోరాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఆకలిని తొలగించి, సమూల మార్పు తీసుకువచ్చేందుకు విశేషంగా కృషి చేస్తోంది.