వీడియో వైరల్: రిక్షాను లాక్కెళ్లిన రోబో.. భవిష్యత్‌‌లో ఇంతేనేమో!

వీడియో వైరల్: రిక్షాను లాక్కెళ్లిన రోబో.. భవిష్యత్‌‌లో ఇంతేనేమో!

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌‌లో రోజూ చాలా వీడియోలు ట్రెండింగ్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం నెటిజన్స్‌‌ను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ రిక్షాను రోబో లాక్కెళ్తూ ఉండటాన్ని సర్‌‌ప్రైజింగ్‌గా చెప్పొచ్చు. వివరాలు.. ఓ వ్యక్తి వచ్చి రిక్షాలో కూర్చున్నాడు. రిక్షాను లాగడానికి రెడీగా ఉన్న రోబో డాగ్‌‌ను తనను మార్కెట్‌‌కు తీసుకెళ్లాల్సిందిగా సదరు వ్యక్తి ఆదేశించాడు. దీంతో రోబో రిక్షాను తోలుకుంటూ వెళ్లింది. భవిష్యత్‌‌లో రిక్షాలు ఇలాగే ఉండబోతున్నేయేమో అనేలా ఈ వీడియో ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది భవిష్యత్‌‌ను సూచిస్తోందని కొందరు మెసేజ్ చేస్తున్నారు. ఇలాంటి రోబోల వల్ల చాలా మంది రిక్షా కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు.