
చెన్నై: కరోనా పాజిటివ్ పేషంట్లకు ఇప్పటికే పలు దేశాల్లో హాస్పిటల్స్ లో రోబోలతో సేవలు చేయిస్తుండగా.. ఇప్పుడు ఇండియాలోను కొన్ని హాస్పిటల్స్ లో వీటిని ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్, లక్షణాలతో హాస్పిటల్‌లో అడ్మిటైన పేషెంట్లకు చెన్నైలో రోబోలు సేవలు అందిస్తున్నాయి. చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో కరోనా వ్యాధితో, ఆ లక్షణాలకు అడ్మిట్ అయిన రోగులకు ఆహారం, మందులు అందించడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు.
ఈ వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా 2301 కేసులు నమోదుకాగా, 56 మంది మరణించారు. దీంతో చెన్నైలోని పలు హాస్పిటల్స్ లో కరోనా బాధితలకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వీరికి సమయానికి మందులు, ఆహారం అందిచడానికి కొన్ని హాస్పిటళ్లలో రోబోలను ఉపయోగిస్తున్నారు.