
న్యూఢిల్లీ: ఇండియా వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న.. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 53వ స్థానంలో నిలిచాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న 20 ప్లేస్‌లు కిందకు దిగజారాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రాణించకపోవడంతో అతని ర్యాంక్ గణనీయంగా తగ్గింది. దాంతో 15 ఏళ్ల తర్వాత తొలిసారి టాప్–50లో చోటు కోల్పోయాడు. యూకీ భాంబ్రీ ఆరు ప్లేస్‌లు మెరుగుపడి 35వ ర్యాంక్‌లో నిలిచాడు. సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 233వ ర్యాంక్‌కు పడిపోయాడు. జులై 2024లో కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్ 68వ ప్లేస్‌కు ఎగబాకాడు. కానీ అదే ఫామ్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. శశికుమార్ (430), కరణ్ సింగ్ (445), ఆర్యన్ షా (483), దేవ్ జావియా (621) ర్యాంక్‌లు కూడా తగ్గాయి. ఎన్. శ్రీరామ్ బాలాజీ (72), రిత్విక్ బొల్లిపల్లి (72), విజయ్ సుందర్ ప్రశాంత్ (100).. టాప్–100లో కొనసాగుతున్నారు.