బీఆర్ఎస్ నేతలవి మోసపూరిత హామీలు : రోహిన్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలవి మోసపూరిత హామీలు : రోహిన్ రెడ్డి

అంబర్​పేట, వెలుగు : బీఆర్ఎస్ నేతల మోసపూరిత హామీలను నమ్మొద్దని అంబర్​పేట కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి ఓటర్లకు సూచించారు. రెండుసార్లు అవకాశం ఇచ్చినా  కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడని ఆయన ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి.. ప్రజలకు అప్పులు ఇచ్చి.. తన కుటుంబం ఆస్తులు పెంచుకున్నాడని విమర్శించారు. అధికారంలో ఉన్నవారు అంబర్ పేట అభివృద్ధిని మర్చిపోయారని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఓవైసీ నగర్, విక్టోరియా హోటల్, ఆకాశ్ నగర్, చెన్నారెడ్డి నగర్, బాపూనగర్, సోమసుందర్ నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6 గ్యారంటీల హామీలను తెలియజేసి ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు భారీగా పాల్గొన్నారు.