Yashasvi Jaiswal: జైశ్వాల్ మనసు మార్చిన రోహిత్.. యూ-టర్న్ తీసుకోవడానికి రీజన్ రివీల్

Yashasvi Jaiswal: జైశ్వాల్ మనసు మార్చిన రోహిత్.. యూ-టర్న్ తీసుకోవడానికి రీజన్ రివీల్

టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ జూలై, 2025 ప్రారంభంలో NOC కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ యువ ఓపెనర్ సొంత రాష్ట్రం ముంబైని వదిలిపెట్టి గోవాకు వెళ్లాలనే తన ఆలోచన తెలిపాడు. అయితే అంతలోనే తన మనసు మార్చుకొని మే 2025లో తన దరఖాస్తును రద్దు చేయమని అభ్యర్థిస్తూ MCAకి జైశ్వాల్ ఇమెయిల్ పంపాడు. 

జైశ్వాల్ యూ-టర్న్ నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ గౌరవించింది. నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని చేసిన అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జైస్వాల్‌ను గోవాకు వెళ్లకుండా ఒప్పించింది రోహిత్ శర్మ అని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించారు.

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్‌ను దేశీయ సర్క్యూట్‌లో గోవాకు వెళ్లకుండా ముంబై తరపున ఆడటం కొనసాగించమని ఒప్పించాడని అజింక్య నాయక్ కన్ఫర్మ్ చేశాడు. "జైశ్వాల్ ను ముంబై జట్టుతోనే ఉండమని రోహిత్ శర్మ కోరాడు. రంజీ ట్రోఫీని రికార్డు స్థాయిలో 42 సార్లు గెలుచుకున్న ముంబై వంటి జట్టుకు ఆడటంలో గర్వకారణమని.. ముంబై జట్టుకు ఆడడం ఎంతో ప్రతిష్ఠతో కూడుకున్నది అని అతనికి వివరించాడు.

ముంబై క్రికెట్ కారణంగానే తన ప్రతిభను నిరూపించుకొని భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడని.. ఈ విషయం జైశ్వాల్ ఎప్పటికీ మర్చిపోకూడదని రోహిత్ అర్ధమయ్యేలా చెప్పాడు. జైశ్వాల్ ముంబైలోనే క్రికెట్ ప్రారంభించాడు. ఆ తర్వాత అన్ని వయసుల జట్లకు ఎంపికయ్యాడు". అని MCA అధ్యక్షుడు అజింక్య నాయక్ అన్నారు.

ALSO READ : ఇది ఫుట్ బాల్ కాదు బాక్సింగ్..

23 ఏళ్ల జైస్వాల్ తన అండర్-19 నుంచి ముంబై జట్టుతోనే ఆడుతున్నాడు. 2019లో ముంబై జట్టు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి డొమెస్టిక్ క్రికెట్ లో రికార్డులు సృష్టించాడు. తన డెబ్యూ సిరీస్ లోనే 10 మ్యాచ్‌ల్లో 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు. వీటిలో  నాలుగు సెంచరీలు ఉన్నాయి. అన్ని ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో జైశ్వాల్ 60.85 సగటుతో 3,712 పరుగులు సాధించాడు.