లిక్కర్​ స్కాం​లో తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంల పాత్ర : తరుణ్ చుగ్

లిక్కర్​ స్కాం​లో తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంల పాత్ర : తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో తెలం గాణ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఆ మధ్య ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ను తెలంగాణ సీఎం కేసీఆర్​ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత ఎందుకు భయపడుతున్నారని, ఆమె ఎందుకు 10 ఫోన్లు పగులగొట్టాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశా రు. లిక్కర్ పాలసీ సమయంలో కవిత ఢిల్లీలో ఎందుకు సమావేశయ్యారని ప్రశ్నించారు.

శనివారం ఢిల్లీలో తరుణ్​ చుగ్​ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మద్యం పాలసీపై లోతైన దర్యాప్తు జరపాలని.. ఇందులో పంజాబ్, తెలంగాణ, ఢిల్లీకి ఉన్న సంబంధాలు ఎంక్వయిరీ చేస్తే తెలుస్తాయని అన్నారు. మాఫియా తరహాలో కవిత, పలువురు ఫోన్లను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. చట్టం ముందు అందరూ సమానులే అని, ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన చట్టానికి అతీతులు కారని ఆయన అన్నారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ పంచిన చెక్ లు బౌన్స్ అయ్యాయని,  వీటిపై రైతులు కంప్లైంట్ చేస్తున్నారని పేర్కొన్నారు.