సూర్య కొత్త మూవీ రోలెక్స్ ..

సూర్య కొత్త మూవీ రోలెక్స్ ..

కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్‌‌‌‌’ చిత్రంలో సూర్య పోషించిన ‘రోలెక్స్‌‌‌‌’ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే.  దీంతో ఆ పాత్రనే లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌గా చేసి ఓ సినిమా ప్లాన్ చేసినట్టు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రకటించాడు. అది మొదలు.. ఎప్పుడెప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉండబోతోందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఇక ప్రస్తుతం ‘కంగువ’ చిత్రం ప్రమోషన్స్‌‌‌‌తో బిజీగా ఉన్నాడు సూర్య.  ఈ ప్రమోషన్స్‌‌‌‌లో ‘రోలెక్స్‌‌‌‌’ మూవీ గురించి సూర్య కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 1986లో విడుదలైన ‘విక్రమ్‌‌‌‌’ సినిమాతో 2022లో వచ్చిన ‘విక్రమ్‌‌‌‌’కు ఎలా కనెక్షన్ ఉందో.. అదే విధంగా ‘రోలెక్స్’ చిత్రానికి కూడా తాను గతంలో నటించిన ఓ సినిమాకు లింక్ ఉంటుందని సూర్య చెప్పాడు.  

దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక శివ దర్శకత్వంలో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా విడుదల కానుంది. దిశాపటానీ హీరోయిన్. బాబీడియోల్‌‌‌‌ విలన్‌‌‌‌గా నటించాడు.  శివ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.