దీపావళికి రొమాన్స్

దీపావళికి రొమాన్స్

పూరి జగన్నాథ్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు ఆకాష్. తను హీరోగా అనిల్ పాదూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో రూపొందిన ‘రొమాంటిక్’ మూవీ తనకో మంచి విజయాన్ని అందిస్తుందని ఆశపడుతున్నాడు. పూరి జగన్నాథ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ, స్ర్కీన్‌‌‌‌‌‌‌‌ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కేతికా శర్మ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మకరంద్ దేశ్‌‌‌‌‌‌‌‌పాండే, ఉత్తేజ్, సునైన ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి.  సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజయ్యాయి. త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే వరుణ్ తేజ్ ‘గని’, రజినీకాంత్ ‘అన్నాత్తే’ చిత్రాలు దీపావళి రేసులో ఉన్నాయి. మరికొన్ని మూవీస్ కూడా ఆ సీజన్‌‌‌‌‌‌‌‌లో రావడానికి రెడీ అవుతున్నాయి. వాటితో పోటీకి దిగుతున్నాడన్నమాట ఆకాష్.