డిప్యూటీ సీఎం పవన్‌కు ఛాంబర్‌ రెడీ

డిప్యూటీ సీఎం పవన్‌కు ఛాంబర్‌ రెడీ

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పాలనాపరమైన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కిన వారు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఏపీకి నాలుగవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పలు శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సచివాలయంలోని రెండో బ్లాకులో మొదటి అంతస్థులో 212 రూమ్ ని కేటాయించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయించిన రెండో అంతస్తులోనే జనసేనకు చెందిన మంత్రులకు కూడా చాంబర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ల చాంబర్లు పక్కపక్కనే ఉండనున్నాయని సమాచారం. కాగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ 19న బాధ్యతలు స్వీకరించనున్నారు.