
గులాబీలు పువ్వుల్లోనే అసాధారణ పుష్పాలు. అందుకే వాటిని "పువ్వుల రాణి" అని పిలుస్తారు. గులాబీ అందానికి, ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. వివిధ రకాల రంగుల్లో.. వెల్వెట్ రేకులు, మనోహరమైన సువాసనతో గులాబీలు మనసను దోచేస్తాయి.
గులాబీలతో ప్రయోజనాలు..
గులాబీ పూలలలో యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి అవసరమైన విటమిన్లు అధికంగా ఉంటాయి. గులాబీలు వృద్ధాప్యాన్ని తగ్గించడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే చర్మాన్ని కాంతివంతం చేస్తయి. రోజా పూలను డిప్రెషన్, దగ్గు, జలుబు, కడుపు సమస్యలు, తలనొప్పి, మైకము వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇతర పూలతో పోలిస్తే.. గులాబీలు ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి. గులాబీలు అధిక పోషక పదార్ధాలను కలిగి ఉంటాయి. వీటి వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. అది ఎలాగంటే..
గులాబీలను ఆహారంగా తీసుకునే మార్గాలు
రోజ్ సిరప్
రోజ్ ప్లవర్స్ తీసుకోవాలి. గులాబీ రెక్కలను వాటర్ లో వేసుకోవాలి. శుబ్రంగా కడగిన తర్వాత గిన్నెలోకి చక్కెర తీసుకోవాలి. వాటిలో కొన్ని వాటర్ పోసుకవాలి. చక్కెర పాకం వచ్చే దాక వెయిట్ చేయాలి. పాకం తయారయ్యాక..వీటిలో గులాబీ రెక్కలు వేయాలి. నాలుగైదు గంటలు వెయిట్ చేయాలి. ఆ తర్వాత వడపోయాలి. అదే రోజ్ సిరప్.
గులాబీ జామ్, జెల్లీస్..
రోజ్ బెర్రీలు, రేకులను జామ్‌ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ జామ్ ను బ్రెడ్, క్రోసెంట్స్, బక్లావా లేదా ఐస్ క్రీం పైన జెల్లీగా కూడా తినవచ్చు.
అలంకరణకు...
మేకరీ తినుబండారాలు, సూప్ లు, మాక్ టెయిల్ వంటి డ్రింక్స్ కు తాజా గులాబీ రేకులు అలంకరణకు ఉపయోగపడతాయి. గులాబీ రేకులను ఐస్ క్యూబుల్లో కలిసి పోయి కొత్త రుచిని అందిస్తాయి.
మూలికల టీ
గులాబీ రేకులు,గులాబీ మొగ్గలతో సువాసనగల టీను తీయారు చేసుకోవచ్చు. వీటితో కొన్ని తీపి, మరికొన్ని చేదుగా టీలు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే ఎండబెట్టిన గులాబీ రేకులను వేడి నీటిలో వేసి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోజ్ టీలోని పాలీఫెనాల్స్ మన శరీరాన్ని సెల్యులార్ క్షీణత, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం నుండి రక్షిస్తాయి.
కొన్ని బేకరీ తినుబండారాల్లో...
మధ్యప్రాచీన దేశాలు,భారతీయ వంటకాలలో తినే గులాబీలు, రోజ్ వాటర్ పేస్ట్రీలు, డెజర్ట్ లలో ఒక ఫ్లేవర్ గా ఉపయోగపడతాయి.