
తిరుపతిలో రౌడీ షీటర్ బెల్టు మురళీ దారుణ హత్యకు గురయ్యాడు. లీలామహల్ సమీపంలోని ఎస్ కే పాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా నరికి చంపారు. నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే నరికి చంపడంతో ప్రజలు భయంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు. హత్యకు గురైన మురళీపై తిరుపతిలోని పలు స్టేషన్ లలో కేసులు, ఒక మర్డర్ కేసులో ప్రదాన నిందితుడుగా ఉన్నాడు. దీంతో ప్రత్యర్థులే చంపి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. 8 మంది ఈ హత్య చేసినట్లు చెబుతున్నారు.