Bike News : 2024లో కొత్తగా వస్తున్న బైక్స్ ఇవే.. ధరలు ఇలా

Bike News : 2024లో కొత్తగా వస్తున్న బైక్స్ ఇవే.. ధరలు ఇలా

2023లో రకరకాల బైక్ లు మార్కెట్లో వచ్చాయి.  2024లో కూడా బైక్ ప్రియులకోసం కంపెనీలు కొత్తకొత్ మోడళ్లు, ఫీచర్లతో మరిన్ని బైక్ లను లాంచ్ చేయడమే లక్ష్యం గా పెట్టుకున్నాయి. అప్ డేట్స్, రీఫ్రెష్ చేయబడిన మోడళ్లో ఈ ఏడాది భారత్ లో విడుదల చేసే రకరకాల మోటార్ బైక్ ల జాబితాను మనముందుంచాయి . అవేమిటో వాటిలో కొన్ని చూద్దాం... 

రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బాబర్

రాయల్ ఎన్ ఫీల్ట్ 2024లో క్లాసిక్ 350 బాబర్ తో సహా చాలా రకాల మోటార్ బైక్ లను అందించనుంది. పొడవైన హ్యాండిల్ బార్, ఫార్వర్డ్ సెట్ పెగ్ లతో బాబర్ విభిన్న రైడింగ్ ఎర్గోనామిక్స్ తో వస్తుంది. ఇది ఫ్లోటింగ్ పలియన్ సీట్, వైట్ వాల్ టైర్లు, యాడ్ క్రోమ్ ఎలిమెంట్స్ తో వస్తోంది. 

ఇక మిగతా ఫీచర్లన్నీ క్లాసిక్ 350 -349సీసీ ఇంజిన్ నుంచి హార్డ్ వేర్, ఫీచర్ల వరకు ఒకే విధంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ మార్పులతో బాబర్ స్టాండర్డ్ వెర్షన్ కంటే ఎక్కువ ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

KTM 125 డ్యూక్ 

ఇప్పటికే భారత్ లో  KTM 390 డ్యూక్, KTM 350 డ్యూక్ లు లాంచ్ చేయబడ్డాయి. ఇప్పుడు KTM 125డ్యూక్ ఇండియా మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది 390 డ్యూక్, 350 డ్యూక్ మాదిరిగానే దూకుడుగా స్టైలిష్ గా ఉంటుంది కానీ చిన్న ఇంజిన్ తో ఉంటుంది. ఈ బైక్ ఫీచర్ల విషయానికొస్తే యాంటి ఫోర్క్స్, LCD డిస్ ప్లే, డ్యూయెల్ ఛానల్ ABS లను కలిగి ఉంటుంది. అన్ని రకాల అప్ డేట్ లతో KTM125 డ్యూక్ ధర రూ.1.79 లక్షలు..ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. 

బజాజ్ పల్సర్ N400 

బజాజ్ పల్సర్  N400 2024లో ఇండియాలో లాంచ్ చేయబోయే మరో బైక్. 373 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 39.4bhp, 35Nm తో వస్తోంది. డొమినార్ 400 మాదిరిగానే బజాజ్ పల్సర్ N400 లో డ్యూయెల్ ఛానల్ ABS, పూర్తి LED లైటింగ్తో కూడిన LCD డిస్ ప్లే వస్తుందని భావిస్తున్నారు. డోమినార్ 400 ధర రూ. 2.29 లక్షలు కాగా.. బజాజ్ పల్సర్ N400 ఎక్స్ షోరూమ్ ధర రూ. 2 లక్షలు ఉండొచ్చన  అంచనా.