ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు.. వీసీ ద్వారా మోదీ పంపిణీ

ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు.. వీసీ ద్వారా మోదీ పంపిణీ

కొత్తగా చేరిన దాదాపు 51వేల రిక్రూట్‌మెంట్లకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా నిర్వహించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్య‌క్ర‌మంలో.. అపాయింట్‌మెంట్ లెట‌ర్‌లు పొందిన కొత్త‌గా రిక్రూట్‌ అయిన వారందరికీ మోదీ అభినందనలు తెలిపారు. 

Also Read : ఎమ్మెల్సీ కవిత కేసు నవంబర్ 20కు వాయిదా 

ప్రభుత్వ విధానాలు మహిళలకు కొత్త అవకాశాలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నాయని, కొత్త పార్లమెంట్ భవనం నుంచి దేశ కొత్త భవిష్యత్తు ప్రారంభమైందని ప్రధాని మోదీ అన్నారు. "కొన్ని రోజుల క్రితమే దేశంలో 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ బిల్లు) రూపంలో వారికి బలాన్ని అందించింది" అన్నారాయన. మ‌హిళ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తితో అనేక రంగాల్లో మార్పు తీసుకురావాలని చెప్పారు. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదగాలని సంకల్పించిందని కూడా ఆయన నొక్కి చెప్పారు. రాబోయే కాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం అని ప్రధాని జోడించారు.

ఈ రోజ్‌గార్ మేళా ఈవెంట్ ద్వారా, ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో సిబ్బందిని రిక్రూట్ చేస్తోంది. ఇందులో పోస్ట్స్ డిపార్ట్‌మెంట్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ మినిస్ట్రీ , ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇతర శాఖలున్నాయి.