తాగి వెహికల్​ నడిపితే రూ. 10 వేల ఫైన్.. డ్రగ్స్‌‌ కేసులో దొరికితే జైలుకే

తాగి వెహికల్​ నడిపితే రూ. 10 వేల ఫైన్.. డ్రగ్స్‌‌ కేసులో దొరికితే జైలుకే

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర వాప్తంగా జరిగే న్యూఇయర్​సెలబ్రేషన్స్, ఈవెంట్స్‌‌పై పోలీసులు స్పెషల్​ఫోకస్​పెట్టారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్‌‌ డ్రైవ్, డ్రగ్‌‌ డిటెక్షన్‌‌ టెస్ట్‌‌లు నిర్వహించాలని నిర్ణయించారు. మద్యం తాగి పట్టుబడిన వారి వాహనాలను సీజ్​చేయడంతోపాటు ఆల్కహాల్​కంటెంట్ ను బట్టి కేసు నమోదు చేసి, రూ.10 వేలు, ఆరు నెలల జైలు శిక్ష పడేలా కొరడా ఝుళిపించనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్‌‌పీ ఆఫీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాఫిక్, లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ పోలీస్‌‌స్టేషన్స్‌‌ పరిధిలో చెక్‌‌పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్‌‌‌‌ టెస్ట్‌‌లు తప్పనిసరి చేయాలని ఆదేశించింది.

ప్రతీ పీఎస్ ​పరిధిలో 5 చెక్‌‌ పాయింట్స్

న్యూ ఇయర్​వెంట్స్‌‌కు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరైనా కొనసాగిస్తే.. కేసులు నమోదు చేస్తారు. ప్రతి పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో 5 చెక్‌‌పాయింట్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్‌‌ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డ్రంకెన్​డ్రైవ్​తనిఖీలు నిర్వహించనున్నారు. డ్రగ్స్‌‌ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్‌‌ డిటెక్షన్స్‌‌ను టెస్ట్‌‌లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీఎస్ యాంటీ నార్కొటిక్స్‌‌ బ్యూరో(టీ న్యాబ్‌‌) ఇప్పటికే120 డ్రగ్ డిటెక్షన్​ పరికరాలను కొనుగోలు చేసింది. 

డ్రగ్స్‌‌ కేసులో జైలుకే

డ్రంకెన్ ​డ్రైవ్‌‌లో పట్టుబడిన వారి బ్లడ్‌‌ ఆల్కహాల్‌‌ కంటెంట్(బీఏసీ)30 ఎమ్‌‌ఎల్‌‌ వచ్చినా వారిపై కేసులు నమోదు చేస్తారు. మద్యం మోతాదుకు అనుగుణంగా చార్జ్‌‌ షీట్స్ ఫైల్‌‌ చేస్తారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్​ఇచ్చిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. డ్రంకెన్ ​డ్రైవ్ కేసులో  రూ.10 వేల జరిమానా లేదా ఆ నెలల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు డ్రంకెన్ డ్రైవ్‌‌ డేటా ఆధారంగా డ్రైవింగ్ లైనెన్స్‌‌ను సస్పెండ్‌‌ చేస్తారు. డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన వారిపై ఎన్‌‌డీపీఎస్ యాక్ట్‌‌ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇలాంటి కేసుల్లో బెయిల్‌‌ దొరికే చాన్స్​తక్కువ ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నేడు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

న్యూ ఇయర్​ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటల వరకు హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ నడపనున్నారు. చివరి రైళ్లు సంబంధిత స్టేషన్ నుంచి అర్ధరాత్రి 12.15 నిమిషాలకు బయలుదేరి ఒంటిగంటకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి వెల్లడించారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో  పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉంటుందన్నారు. ప్యాసింజర్లు మెట్రో సిబ్బందికి సహకరించాలని కోరారు.

ట్యాంక్‌‌బండ్‌‌,నెక్లెస్‌‌ రోడ్స్ మూసివేత


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్‌‌ లిమిట్స్‌‌లో దాదాపు 260 చెక్‌‌ పోస్ట్‌‌లు ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌‌, బేగంపేట్‌‌, సైఫాబాద్‌‌, సైబరాబాద్‌‌ పరిధిలో ఒక్కో పీఎస్‌‌ లిమిట్స్‌‌లో 5 నుంచి 7 చెక్‌‌పోస్టులు ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులతో పాటు టీ న్యాబ్‌‌ పోలీసులు జాయింట్ ఆపరేషన్స్ చేస్తారు. పబ్స్‌‌, శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్‌‌ సహా డ్రగ్స్, గంజాయి హాట్‌‌స్పాట్స్‌‌ గుర్తించిన ఏరియాల్లో మఫ్టీలో నిఘా పెట్టనున్నారు. రాత్రి 8 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 7 గంటల వరకు చెకింగ్స్‌‌ కొనసాగించాలని నిర్ణయించారు. ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై ఎయిర్‌‌‌‌ పోర్ట్‌‌కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఉంది. సిటీలోని లంగర్‌‌‌‌హౌస్‌‌, బేంగంపేట్ ఫ్లై ఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్స్‌‌, ట్యాంక్‌‌బండ్‌‌, నెక్లెస్‌‌ రోడ్స్ మూసివేస్తారు.

పట్టుబడితే కఠిన చర్యలు


హైదరాబాద్‌‌లో ఎక్కువ ఈవెంట్స్ జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో యువత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్స్‌‌కు అనుమతులు ఉన్నాయి. చట్టపరిధిలోనే వేడుకలు జరుపుకోవాలి. పబ్స్‌‌, రెస్టారెంట్స్‌‌ నిబంధనలకు లోబడే ఈవెంట్ నిర్వహించాలి. మైనర్లను లిక్కర్ పార్టీలకు అనుమతించరాదు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దు. డ్రగ్స్​ విషయంలో కఠిన చర్యలు ఉంటాయి.   - కొత్తకోట శ్రీనివాస్‌‌ రెడ్డి, సీపీ, హైదరాబాద్‌‌