కొండగట్టుకు రూ.100 కోట్లు మంజూరు

కొండగట్టుకు రూ.100 కోట్లు మంజూరు

కొండగట్టు ఆలయ అభివృద్ధికి వందకోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ అన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో కొండగట్టు దశ,దిశ మారనుందని ఆయన చెప్పారు.