చెన్నూరు పట్టణ అభివృద్ధికి రూ.18 కోట్లు : హేమంత్రెడ్డి

చెన్నూరు పట్టణ అభివృద్ధికి రూ.18 కోట్లు :  హేమంత్రెడ్డి

చెన్నూరు, వెలుగు: పట్టణంలోని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్​వెంకటస్వామి రూ.18 కోట్లు కేటాయించారని కాంగ్రెస్​పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, సీనియర్​నాయకుడు హేమంత్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం 16 వ వార్డులోని గెర్రె కాలనీలో మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్​హయాంలో చెన్నూరు మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులపై ఫోకస్​పెట్టారని చెప్పారు. ఎన్నికల సమయంలో రోడ్లపై మురుగునీరు, చెత్త లేకుండా పరిశుభ్రమైన మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.