ఒకే కారుపై రూ. 25వేల చలాన్లు

ఒకే కారుపై రూ. 25వేల చలాన్లు
  • సీజ్​ చేసిన నారాయణ్​ఖేడ్ ​పోలీసులు

నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణ్​ఖేడ్ లోని  రాజీవ్ చౌక్ వద్ద ఎస్సై వెంకటరెడ్డి సిబ్బందితో సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ టైంలో అటుగా వచ్చిన TS 07GP4218 నంబర్​కారును ఆపి చెక్​చేయగా 24 చలాన్లు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించి అవాక్కయ్యారు. ఫైన్ల మొత్తం రూ.24,840 ఉండడంతో వెహికల్ ని సీజ్​చేసి స్టేషన్​కు తరలించారు. దాదాపు అన్నీ ఓవర్​స్పీడ్​చలాన్లే కావడం గమనార్హం. ఫైన్లు మొత్తం కట్టి క్లియరన్స్ తెస్తే కారు అప్పగిస్తామని.. లేకుంటే కేసు ఫైల్​చేసి కోర్టుకు పంపిస్తామని ఎస్సై తెలిపారు.