బాబోయ్ ఒక్కొ టికెట్ ధర 3 వేలకు పైగానే.. నొలాన్ ‘ది ఒడిస్సీ’ రేట్లు చూసి జనాలు షాక్!

బాబోయ్ ఒక్కొ టికెట్ ధర 3 వేలకు పైగానే.. నొలాన్ ‘ది ఒడిస్సీ’ రేట్లు చూసి జనాలు షాక్!

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ' విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ విజువల్ వండర్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జూలై 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఎపిక్ ఫిల్మ్ కోసం సినీ లవర్స్ ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు

 ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానులు భారీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే ఐమ్యాక్స్ (IMAX) షోల టికెట్ ధరలు చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో IMAX షోలకు గరిష్ఠంగా రూ.3,100 వరకు టికెట్ ధరలు నమోదవుతుండగా, ఇతర ప్రీమియం షోల ధరలు రూ.2,500 నుంచి రూ.1,440 మధ్య ఉన్నాయి. సినిమా, థియేటర్, షో టైమ్, సీటింగ్ కేటగిరీ ఆధారంగా ధరలు మారుతున్నాయి. 

ఈ రేట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నోలన్ సినిమా కోసం అంత ఖర్చు పెట్టడం విలువైనదే  అని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  సినిమా చూడటానికే ఇంత ఖర్చా? అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క టికెట్ ధరకు నెల ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది బాబోయ్! అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

 

ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి Aసర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో 18 ఏళ్లు పైబడిన ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను థియేటర్లలో వీక్షించగలరు. సినిమా నిడివి 2 గంటల 52 నిమిషాల 33 సెకన్లు ఉండటం కూడా ఆసక్తిని పెంచుతోంది.

►ALSO READ | Jana Nayagan Release: విజయ్ 'జననాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఆ దేశంలో టికెట్ల కోసం కొత్త రూల్స్!

హోమర్ రచించిన ప్రపంచప్రసిద్ధ గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మ్యాట్ డేమన్, టామ్ హాలండ్, జెండయా, యాన్ హాతవే, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, చార్లీజ్ థెరాన్, జాన్ బెర్న్తాల్, మియా గోత్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అద్భుతమైన విజువల్స్, నోలన్ ప్రత్యేకమైన కథన శైలి, భారీ తారాగణంతో రూపొందిన 'ది ఒడిస్సీ' ఈ ఏడాది బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఇప్పటికే అంచనాలు పెంచేసింది . మరి ఈ భారీ ధరల మధ్య ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి..