జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లతో ప్రణాళికలు

జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లతో ప్రణాళికలు

అలంపూర్, వెలుగు: ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతోన్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి రూ.347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు తక్షణమే రూ.35 కోట్లు అవసరమని నిర్ణయించారు. 

శుక్రవారం హైదరాబాద్​లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్  చైర్మన్  చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, స్తపతి గోవింద హరి, ఆలయ అభివృద్ధి రూపశిల్పి సూర్యనారాయణ మూర్తి జోగులాంబ ఆలయ అభివృద్ధిపై రివ్యూ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. 

జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు అన్ని సౌలతులు కల్పించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మొదటి దశలో రూ.138.40 కోట్లు, రెండవ దశలో రూ.117.60 కోట్లు, మూడవ దశలో రూ.91 కోట్లతో కలిపి రూ.347 కోట్లు అవసరమని గుర్తించినట్లు చెప్పారు.