మల్దకల్ పోలీస్ స్టేషన్ లో రూ.4.33 లక్షలు రికవరీ : ఎస్పీ శ్రీనివాసరావు

మల్దకల్  పోలీస్ స్టేషన్ లో రూ.4.33 లక్షలు రికవరీ : ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు: సైబర్  క్రైమ్  బాధితుడికి రూ.4.33 లక్షలు రికవరీ చేసి అందించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మల్దకల్  పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేయగా డబ్బులను రాబట్టినట్లు చెప్పారు. రెండు సార్లు రూ.5 లక్షల చొప్పున పోయాయని, అందులో గోల్డెన్  అవర్ కు సంబంధించిన ఫిర్యాదులో రూ.4.33 లక్షలు రికవరీ చేశామని తెలిపారు. 

సీఐ శీను, మల్దకల్  ఎస్సై నందికర్, సైబర్  వారియర్  నవీన్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్  జ్యోతి కాంత్  రికవరీలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. ఫస్ట్  క్లాస్  జుడీషియల్  కోర్టు జడ్జి పూజిత రిఫండ్  ఆర్డర్​ జారీ చేయడంతో బాధితుడి ఖాతాలో డబ్బులు జమ చేశామని తెలిపారు.