10 రాష్ట్రాలు, 49 వేల కోట్లు : PACL కుంభకోణం సూత్రధారి అరెస్టు..

10 రాష్ట్రాలు, 49 వేల కోట్లు : PACL కుంభకోణం సూత్రధారి అరెస్టు..

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మరో సెన్సేషన్కి తెర పడింది. ఆర్థిక నేరాల విభాగం (EOW) పెర్ల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (PACL) కంపెనీ ఓనర్ గుర్నామ్ సింగ్‌ను  వేల కోట్లా రూపాల మోసం కేసులో తాజగా అరెస్టు చేసింది. ఈ అరెస్టు ఆ కంపెనీలో  పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు పెద్ద రిలీఫ్ కలిగించింది.  

సమాచారం ప్రకారం, గుర్నామ్ సింగ్ అతని కంపెనీ PACL ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇప్పిస్తానని  చెప్పి వేలాది మందిని భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే కంపెనీ పథకాల ద్వారా పెట్టుబడి పెట్టిన డబ్బుకి ఎక్కువ రెట్లు లాభం వస్తుందని ఇన్వెస్టర్లకు నమ్మపలికాడు. దింతో ఈ ఉచ్చులో పడిన ప్రజలు భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టారు, కానీ కొంతకాలం తర్వాత కంపెనీ దేశవ్యాప్తంగా బోర్డు తిప్పేసి కంపెనీ ఓనర్  సహా ఇతర ప్రధాన నిందితులు పరారయ్యారు.

గుర్నామ్ సింగ్ పెట్టుబడి సంస్థ ఉత్తరప్రదేశ్‌తో పాటు అస్సాం, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, బీహార్ ఇంకా  ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో బ్రాంచిలు తెరిచినట్లు EOW దర్యాప్తులో వెల్లడైంది. ఈ రాష్ట్రాల నుండి వేలాది మంది పెట్టుబడిదారుల ద్వారా  సుమారు రూ.49 వేల కోట్ల మేర మోసం జరిగింది. అంతేకాదు వ్యవసాయ భూమిని ప్రజలకు ఇప్పించే పేరుతో కంపెనీ మోసం కూడా చేసింది.

ALSO READ : 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలి.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి : RSS చీఫ్ భగవత్

ఈ కుంభకోణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో  పెట్టుబడిదారులు గతంలో పోలీస్ కేసు ఫైల్  చేశారు, ఆ తర్వాత ఈ విషయం CBIకి చేరింది. ఈ కేసులో పేరున్న 10 మంది నిందితుల్లో నలుగురిని CBI ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపింది. గుర్నామ్ సింగ్ అరెస్టు తర్వాత పెట్టుబడిదారులు తమ డబ్బు తిరిగొస్తుందని ఆశతో ఉన్నారు. EOW సహా ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ ఫ్రాడ్ నెట్‌వర్క్ మూలాలను లోతుగా విచారిస్తున్నాయి.